మృత్యువు కౌగిట విద్యా కుసుమం

ఎముకల కేన్సర్‌తో బాధపడుతున్న నిట్‌ విద్యార్థి
ఆపరేషన్‌కు 3 నెలల గడువు.. 40లక్షల దాకా ఖర్చు
ఆపన్న హస్తం కోసం మంగీలాల్‌ ఎదురు చూపులు

13-09-2017: మారుమూల గిరిజన తండాలో విరబూసిన విద్యా కుసుమం అతడు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ వరకు అన్నింటా స్టేట్‌, జిల్లా ర్యాంకులే. ప్రఖ్యాత వరంగల్‌ నిట్‌లో ఇంజనీరింగ్‌ చేస్తున్న సరస్వతీ పుత్రుడు. కానీ, అతడిని కేన్సర్‌ రూపంలో మృత్యువు కబళిస్తోంది. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం చిన్న బంజారా తండాకు చెందిన తేజావత్‌ మంగీలాల్‌ ఎముకల కేన్సర్‌తో బాధపడుతున్నాడు. మరో మూడు నెలల్లో ఆపరేషన్‌ చేయకపోతే మంగీలాల్‌ ప్రాణాలకు ప్రమాదమని నిమ్స్‌ వైద్యులు తేల్చారు. ఆపరేషన్‌ కోసం తమిళనాడులోని రాయవెల్లూరులోని కేన్సర్‌ ఆస్పత్రికి వెళ్లాలని, దానికి రూ.40లక్షల దాకా ఖర్చవుతుందని చెప్పారు. రెక్కాడితే గానీ డొక్కాడని మంగీలాల్‌ కుటుంబానికి అంత ఖర్చు కాదు కదా పూటగడవని పరిస్థితి. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ఔదార్యంతో రూ1.5లక్షలతో వైద్యం చేయించినా జబ్బు నయం కాలేదు. ఏ ఆధారం లేని ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. మంగీలాల్‌కు సహాయం చేసే దాతలు తేజావత్‌ మంగీలాల్‌, అకౌంట్‌ నం.35390959584, ఐఎ్‌ఫఎ్‌ససీ:ఎ్‌సబీఐఎన్‌0007167, వడ్డెపల్లి బ్రాంచ్‌ హన్మకొండకు జమ చేయాలని కోరుతున్నారు. పూర్తి వివరాలకు సెల్‌ నం.9440064623ను సంప్రదించవచ్చు.