స్మార్ట్‌ఫోన్‌తో చిన్నారులకు ‘డ్రై ఐ’ ముప్పు

సియోల్‌,జనవరి 9:స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ వాడకంతో చిన్నారులలో డ్రై ఐ డిసీజ్‌(డీఈడీ) ముప్పు పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తు న్నారు. ఇటీవలి కాలంలో పిల్లలు బయటకెళ్లి ఆడుకోవడంకంటే స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్ల ముందరే గడపడం ఎక్కువైందని చెప్పారు. ఇది కళ్లు పొడిబారడం సహా పలు వ్యాధులకు కారణం అవుతోందని హెచ్చరించారు. ఈమేరకు చిన్నపిల్లల్లో స్మార్ట్‌ఫోన్‌ వాడకంపై దక్షిణ కొరియాలోని ఛుంగ్‌ యాంగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లోని చిన్నారులలో స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ వాడకం 61.3 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 51శాతం ఉందని, డీఈడీ ముప్పు పట్టణ ప్రాంతాల పిల్లలకు 8.3 శాతం ఉండగా, గ్రామీణ చిన్నారులలో 2.8 శాతంగా ఉందని పరిశోధకులు తెలిపారు.