రెండోసారి గుండెపోటుకు ఇన్‌ఫామ్మెటరీ థెరపీతో చెక్‌

50 దేశాల్లో 10 వేల మందికి థెరపీ
హైదరాబాద్‌లో 20 మందికి
కార్డియాలజిస్టు డాక్టర్‌ సీ రఘు

 

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఒకసారి గుండెపోటు వచ్చి శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి మరోసారి ముప్పు పొంచి ఉంటోంది. ఇలాంటి ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఇప్పు డు యాంటి ఇన్‌ఫామ్మెటరీ థెరపీ అందుబాటులోకి వచ్చింది. అనేక ప్రయోగాల అనంతరం ఈ థెరపీ సత్ఫలితాలిస్తోందని హృద్రోగ్య నిపుణులు పేర్కొన్నారు. కొంత కాలంగా ఈ థెరపీపై నిర్వహించిన అధ్యయనంలో ఒకటని సీనియర్‌ అస్టర్‌ ప్రైమ్‌ ఆస్పత్రి ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ సీ.రఘు వివరించారు. మంగళవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని సూ చించారు. రెండోసారి గుండెపోటు వచ్చిన 20 మందిపై ఈ థెరపీ అందించి సత్ఫలితాలు సాధించినట్టు ఆయన చెప్పారు.