రొమ్ము కేన్సర్‌ బాధితులకు కాల్చిన మాంసం ప్రాణాంతకం

ఆంధ్రజ్యోతి,జనవరి7:రొమ్ము కేన్సర్‌ బారిన పడి కోలుకున్న వారికి కాల్చిన మాంసం(గ్రిల్‌డ్‌) ప్రాణాంతకంగా మారుతోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈమేరకు 1508 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో భాగంగా.. వలంటీర్ల ఆహారపు అలవాట్లను తెలుసుకునేందుకు ఓ ప్రశ్నపత్రాన్ని తయారు చేశారు. దీనిని బాధితులకు ఇచ్చి సమాధానాలు రాబట్టా రు. ఆపై ఫలితాలను విశ్లేషించగా.. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చిన మాంసం తీసుకున్న వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని తేలిందన్నారు.