40మంది గిరిజన కిడ్నీ రోగుల గుర్తింపు

ఉట్నూర్‌లో నిమ్స్‌ వైద్యులతో పరీక్షలు

ఉట్నూర్‌, జూన్‌ 8: ఆదిలాబాద్‌ జిల్లాలోని కొలాం గిరిజనుల్లో 40మంది కిడ్నీ రోగులను ఏజెన్సీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించి శనివారం ఉట్నూర్‌కు తీసుకొచ్చి నిమ్స్‌కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్‌ గంగాధర్‌, శ్రీనివా్‌సల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఐటీడీఏ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏడు వేల జనాభాకు సర్వే నిర్వహించగా.. ఆరు వేల మందికి రకరకాల జబ్బులు ఉన్నాయని గుర్తించగా. 40మంది కొలాం గిరిజనులు కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నట్లు నిర్థారించారు. ఈ సందర్భంగా నిమ్స్‌ వైద్యుడు గంగాధర్‌ మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధి సమస్యలను ముందుగా గుర్తించి ముదరక ముందు వైద్యం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. ఈ 40మందికి ముందస్తు పరీక్షలు చేయడం ద్వారా వీరికి సరైన వైద్యం అందించడం మొదలు పెట్టి వ్యాధిని నియంత్రించవచ్చని అన్నారు. ప్రస్తుతం వీరిలో అంతగా ఎవరికీ అపాయం లేదన్నారు.