చెన్నై అపోలోలో అరుదైన శస్త్రచికిత్స

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలిక

మెదడుకు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు

చెన్నై, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మెదడు తీవ్రంగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాలుగేళ్ల చిన్నారికి చెన్నైలోని అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రాణం పోశారు. బ్రెయిన్‌ డీకంప్రెసివ్‌క్రాంజెక్టమీ శస్త్రచికిత్స నిర్వహించి మెదడుకు పునరుజ్జీవం కలిగించారు. చెన్నై తండయార్‌పేటకు చెందిన ధన్యశ్రీ గత నెల 29న రోడ్డుపై నడిచి వెళ్తుండగా.. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ రెండో అంతస్థు నుండి జారిన ఓ వ్యక్తి చిన్నారిపై పడ్డాడు.
 
ఈ ప్రమాదంలో ధన్యశ్రీ మెదడు తీవ్రంగా దెబ్బతింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న చిన్నారిని వెంటనే అపోలో చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మెదడు వాచింది. సకాలంలో చికిత్స అందకపోతే మెదడు నిర్జీవమయ్యే ప్రమాదం ఉంది. ఆస్పత్రి పీడియాట్రిక్‌ ఐసీయు సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సుచిత్రరంజిత్‌ నేతృత్వంలోని వైద్య బృందం చిన్నారికి వెంటనే బ్రెయిన్‌ డీకంప్రెసివ్‌క్రాంజెక్టివీ శస్త్రచికిత్స నిర్వహించారు.