సీటీ స్కానింగ్‌లో ఇలా చేద్దాం!

లాస్‌ఏంజెల్స్‌, జనవరి 3:సీటీ స్కానింగ్‌లలో  చాలా రేడియేషన్‌ విడుదలవుతుంది. ఇది రోగుల ఆరోగ్యానికే కాదు.. అక్కడ పనిచేసే వైద్య సిబ్బందికి కూడా చాలా ప్రమాదకరం. స్థిరమైన పరిమాణంలో రేడియేషన్‌ను ఉపయోగిస్తే దుష్పరిణామాలను నివారించవచ్చునని తాజా సర్వే పేర్కొంది. స్థిరమైన రేడియేషన్‌ డోస్‌ వాడేలా చొరవ తీసుకోవాలని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు సూచించారు.