కేన్సర్‌ నివారణకు ప్రాధాన్యమివ్వాలి: డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కేన్సర్‌ గుర్తింపు, నిర్ధారణతో పాటు ఏ దశలో అయినా చికిత్స అందించేందుకు అవసరమైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కోరింది. కేన్సర్‌ నిర్ధారణతో పాటు పర్యవేక్షించేందుకు వసతులు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవని, ఇదే కేన్సర్‌ మరణాలు పెరగడానికి కారణమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ కేన్సర్‌ నివారణకు విధివిధానాలు రూపొందించాలని విన్నవించింది.