హుక్కాతో న్యుమోనియా

09-02-2018: ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌, హుక్కా వంటి వాటితో న్యుమోనియా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ-సిగరెట్ల వల్ల ప్రమాదం లేదని చాలా మంది అనుకుంటారని, కానీ, వాటిలోని ఆవిరితో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లకు గురై ఈ వ్యాధి బారినపడే అవకాశాలున్నాయని యూకేలోని క్వీన్‌మేరీ వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.