అవయవదానంతో ఆదర్శం

హైదరాబాద్, పంజాగుట్ట : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమించడంతో వైద్యులు బ్రెయినడెడ్‌గా ప్రకటించారు. అవయవదానంపై వైద్యులు వారి కుటుంబసభ్యులకు అవగాహన కల్పించడంతో అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా గోదాల గ్రామానికి చెందిన వి.వెంకటరెడ్డి (38) అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 12న తీవ్రమైన తల నొప్పితో బాధపడడమే కాకుండా వాంతులు చేసుకోవ డంతో కుటుంబసభ్యులు లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో ఈనెల 15న వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. భార్య నీరజ, సోదరుడు రాజేశ్వర్‌రెడ్డికి గ్లోబల్‌ వైద్యులు అవ యవదానంపై అవగాహన కల్పించగా అంగీకరించారు. వెంకటరెడ్డికి చెందిన రెండు మూత్రపిండాలు, కళ్ల కార్నియాలు, కాలేయాన్ని సేకరించినట్టు జీవన్‌ధాన్‌ ప్రతినిధులు తెలిపారు.
 
మరో ఘటనలో... 
సైదాబాద్‌కు చెందిన కె.సాంబశివారెడ్డి (69) ఈనెల 12న నగరంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో సృహతప్పి పడి పోయాడు. స్థానికులు అతడిని మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 13న మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెదడులో రక్తం గడ్డకట్టి పరిస్థితి విషమించడంతో వైద్యులు బ్రైయిన్‌డెడ్‌గా ప్రకటించారు. భార్య జానకిలక్ష్మీదేవి, కూతురు అరుణజ్యోతికి అవయవ దానంపై వైద్యులు అవగాహన కల్పించగా అంగీక రించారు. సాంబశివారెడ్డికి చెందిన రెండు మూత్ర పిండాలు, కాలేయాన్ని సేకరించినట్టు జీవన్‌ధాన్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు.