హెచ్‌ఐవీ నియంత్రణకు కొత్త ఆధారాలు!

05-02-2019: హెచ్‌ఐవీని నిరోధించి, వ్యాధి నిరోధకశక్తిని పెంచే టీకాను అభివృద్ధి చేసే కొత్త పద్ధతులను పరిశోధకులు కనుగొన్నారు. ఇన్‌ఫెక్షన్ల నియంత్రణ, హెచ్‌ఐవీ కణాలపై వ్యాధి నిరోధక టీ- కణాలను ప్రతిస్పందించడం మధ్య గల సంబంధాన్ని కెనడాకు చెందిన సిమోన్‌ ఫ్రేజర్‌ యూనివర్సిటీ, దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా హెచ్‌ఐవీ కణాలు తన రూపును మార్చుకుని టీ-కణాల నుంచి తప్పించుకుంటాయని ప్రొఫెసర్‌ మార్క్‌ బ్రోక్‌మన్‌ తెలిపారు. ఆ కణాలు తప్పించుకోలేని విధంగా వ్యాధినిరోధక శక్తిని పెంచి హెచ్‌ఐవీని నియంత్రించవచ్చని పేర్కొన్నారు.