జంక్‌ఫుడ్‌పై మోజెందుకంటే...

08-03-2018: స్థానికంగా లభించే ఆహారం, ఇంట్లో తయారుచేసిన ఆహారానికి బదులు జంక్‌ఫుడ్‌ను పిల్లలు ఎందుకు ఇష్టపడతారో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఫాస్ట్‌ఫుడ్‌ కంపెనీల లోగోలను గుర్తించే పిల్లలు పిజ్జా బర్గర్లు, శీతల పానీయాలపై మోజు పెంచుకుంటున్నారని పరిశోధకులు తెలిపారు. చైనా, భారత్‌, బ్రెజిల్‌, నైజీరియా, పాకిస్తాన్‌, రష్యాల్లో అంతర్జాతీయ ఆహారంపై మోజు, మార్కెటింగ్‌, మీడియా మధ్య ఉన్న సంబంధాలపై అమెరికాలోని మేరీలాండ్‌ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. అంతర్జాతీయ ఆహార కంపెనీల లోగోలు పిల్లల దృష్టిని ఆకర్షిస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని తెలిపారు.