మంచి పనులు చేసే వారే స్ఫూర్తి: మంచు లక్ష్మి

ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీలైఫ్‌: ‘సమాజంలో మంచి పనులు చేసే వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి. అటువంటి వాళ్లను ప్రోత్సహించాలి’ అని సినీ నటి మంచు లక్ష్మి అభిప్రాయపడ్డారు. ‘రూట్స్‌’ హెల్త్‌ ఫౌండేషన్‌ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆమె విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో సంస్థ వెబ్‌సైట్‌ను ఆదివారం ప్రారంభించారు. ‘క్యాన్సర్‌ ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ముందుగా గుర్తించేలా ప్రజల్లో రూట్స్‌ సంస్థ అవగాహన కల్పించడం అభినందనీయం. సమాజానికి సేవచేసే వాళ్లను గుర్తించి సన్మానించడం నచ్చింది. 2013 నుంచి డాక్టర్లంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి రోగాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం ఒక మంచిపని.’ అని ఆమె ప్రశంసించారు.