నవ్వితే సంతోషంగా ఉన్నట్లు కాదు

09-09-2018: నవ్వు.. ఆనందానికి బాహ్య సంకేతం. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఉండేలా చేసేది మందహాసమే. అయితే, నవ్వేవారంతా సంతోషంగా ఉన్నట్లు కాదని తాజా పరిశోధనలో వెల్లడైంది. నవ్వు అనేది ఒక ముఖ కవళిక మాత్రమేనని, ఆనందాన్ని బయటికి చూపుతుందన్నది నిజం కాదని బ్రిటన్‌కు చెందిన బ్రైటన్‌ అండ్‌ సస్సెక్స్‌ మెడికల్‌ స్కూల్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.