షాపింగ్‌తో ఆయుష్షు పెరుగుతుందా?

05-06-2019: షాపింగ్‌ చేయటం ఆడవారికి ఇష్టమేమో కానీ మగవారికి కష్టమే. ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ కొనుగోళ్ళలో పడి, బయట షాపింగులు, కొనుగోళ్ళు తక్కువవుతున్నాయి. కానీ షాపింగ్‌ చేస్తే ఆయుష్షు పెరుగుతుందంటున్నాయి తాజా అధ్యయనాలు. ఎవ్వరితో మాట్లాడకుండా ఇంట్లోనే కాలం గడిపేవారితో పోలిస్తే తరచూ షాపింగ్‌మాల్స్‌కి, దుకాణాలకు, పచారీ కొట్లకు వెళ్ళేవారు 27 శాతం అధికంగా జీవిస్తారని తైవాన్‌ నేషనల్‌ హెల్త్‌ రీసెర్చ్‌ పదేళ్ళపాటు పరిశోధనలు చేసి, నిర్ధారించింది. సమాజంలో ఉంటూనే ఒంటరితనంతో మగ్గిపోతున్నవారికి ఈ షాపింగ్‌ కొత్త ఊపిరులు పోసి, ఆయుష్షు పెంచేందుకు దోహదం చేస్తుందట. అంతేకాదు సాధారణ వ్యక్తులతో పోలిస్తే తరచూ కొనుగోళ్ళు చేసేవారిలో జీవితకాలం అధికంగా ఉంటోందని ఈ అధ్యయనకారులు అంటున్నారు. షాపింగ్‌తో మెదడు చురుగ్గా ఉండి ఆయుష్షు పెరుగటానికి కారణమవుతుందంటున్నారు.