హైపర్‌టెన్షన్‌ భారత్‌!

 

న్యూఢిల్లీ, మే 5: భారత్‌లో ఎక్కువ మంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతుంటారు. కానీ చాలా మంది పెద్దలు దీని గురించి తెలుసుకోలేకపోతున్నారని తాజా సర్వే పేర్కొంది. కేవలం 45ు మంది మాత్ర మే ఈ అంశంపై అవగాహన కలిగి ఉన్నట్లు తెలియజేస్తోంది. నేషనల్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ సర్వే వివరా లు ఆధారంగా పరిశోధకులు ఈ అంశాన్ని గుర్తించా రు. ఈ సర్వేలో దాదాపు 7లక్షల మందికిపైగా ప్రజల వివరాలున్నాయి. ప్రతి నలుగురిలో ముగ్గురు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నా పరీక్ష చేయించుకోవ డంలేదని పీఎల్‌వోఎస్‌ మెడిసిన్‌ అనే జర్నల్‌లో వివరించారు. బర్మింగ్‌హమ్‌ వర్సిటీ, గొట్టిజన్‌ వర్సిటీకి చెందిన వివిధ సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పురుషులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంలేదని అధ్యయనంలో పేర్కొ న్నారు. పరీక్షలు చేయించుకుంటున్న రాష్ట్రాల్లో హరియాణా 93.5ుతో అగ్రస్థానంలో ఉండగా.. 61.3ుతో మధ్యప్రదేశ్‌ చివర్లో ఉంది. ఛత్తీ్‌సగఢ్‌లో 22.1ు మందికి హైపర్‌టెన్షన్‌ అంటే ఏమిటో తెలియదు.