ఒత్తిడితో గుండెపోటు ముప్పు!

12-04-2019: ఆఫీసులో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక భారం.. ఇలా ఏదో ఒక సమస్యతో చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు జర్నల్‌ ది బీఎంజేలో ఒక కథనం ప్రచురితమైంది. 1987 జనవరి నుంచి 2013 డిసెంబరు వరకు మానసిక ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురైన 1,71,314 మంది డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించినట్లులో జర్నల్‌లో పేర్కొన్నారు.