చదువుతో ఆరోగ్యం

03-04-2019: చదువు కారణంగా మంచి వ్యక్తిత్వం, ప్రవర్తనతో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చన్న విషయం ఇటీవలి ఓ పరిశోధనలో వెల్లడైంది. బాగా చదువుకున్న వారు, చదువు మధ్యలో ఆపేసిన సుమారు మూడు లక్షల మంది మీద ఈ అధ్యయనం చేశారు. డిగ్రీ చదివిన వారి కన్నా ఇంటర్ తో ఆపేసిన వాళ్ళే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనీ, వారిలో ఒత్తిడితో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. తక్కువ చదువు, తక్కువ సంపాదన జీవితంలో అభద్రతకు దారి తీస్తాయన్న విషయం ఈ అధ్యయనం స్పష్టం చేసింది. చిన్నతనం నుంచే పిల్లలు బాగా చదువుకునే విధంగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలనీ, చదువుతో వారి భవిష్యత్తే కాకుండా ఆరోగ్యం కూడ బాగుంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.