వేడి టీ తాగితే జీర్ణాశయ కేన్సర్‌?

10-04-2019: చాలా మందికి వేడి వేడి టీ తాగితేనే తాగినట్టు ఉంటుంది. అలాంటి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు పరివోధకులు. వేడి వేడి టీ తాగడం వలన దీర్ఘకాలంలో జీర్ణాశయ కేన్సర్‌ బారిన పడే ప్రమాదముందన్న సంగతి వీరు నిర్వహించిన ఓ అధ్యయనంలో స్పష్టమైంది. నలభై నుంచి 75సంవత్సరాల వయస్సుకల 50వేల మంది మీద సుమారు పది సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. వీరిలో సగంమందికి పైగావేడి టీతాగే అలవాటుంది. అధ్యయనకాలం ముగిసే నాటికి వీరిలో రెండు వందల మంది జీర్ణాశయ కేన్సర్‌ బారిన పడడాన్ని వీరు గుర్తించారు. 60సెంటీగ్రేడ్‌ వద్ద మరిగించిన టీని రోజుకు 750 ఎంఎల్‌ తాగితే కేన్సర్‌ వచ్చే అవకాశాలు 20 శాతమున్నాయని వీరు స్పష్టం చేస్తున్నారు. టీతాగే అలవాటున్నవారు రూమ్‌ టెంపరేచర్‌ వద్ద చల్లార్చిన టీని మాత్రమే తాగాలని వారు సూచిస్తున్నారు.