స్థూలకాయానికి ‘ప్రకృతి ఔషధం’

సముద్రపు నాచుతో తయారు చేసిన భారత్ మెరైన్‌ శాస్త్రవేత్తలు 
కొచ్చి, ఫిబ్రవరి 15: స్థూలకాయాన్ని తగ్గించేందుకు భారత శాస్త్రవేత్తలు ‘ప్రకృతి ఔషధాన్ని’ కనుగొన్నారు. కొవ్వులను కరిగించే (యాంటీహైపర్‌కొలెస్ట్రాలిమిక్‌) గుణం కలిగిన సముద్రపు నాచు నుంచి ‘కాడల్మిన్‌ టీఎం’ అనే ఔషధాన్ని తయారుచేశారు. ఈ ఔషధం స్త్రీలల్లో కనిపించే డైస్లిపిడిమియా వ్యాధి నివారణకు కూడా ఉపయోగపడుతుంది. కొచ్చిలోని కేంద్ర మెరైన్‌ ఫిషరీస్‌ పరిశోధన సంస్థ (సీఎంఎ్‌ఫఆర్‌ఐ)కు చెందిన శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు. శనివారం జరగనున్న సీఎంఎ్‌ఫఆర్‌ఐ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో కేరళ గవర్నర్‌ పి.సదాశివం ఈ ఔషధాన్ని విడుదల చేస్తారు. నూటికి నూరుపాళ్లు సహజ ఔషధ గుణాలు కలిగిన సముద్రపు నాచు మొక్కల నుంచి దీనిని తయారు చేసినట్లు సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కాజల్‌ చక్రబర్తి తెలిపారు. దేశంలో అత్యధికంగా ఉన్న శాకాహారులు ఈ మందును తీసుకోవడంలో సంకోచించాల్సిన పనిలేదని చెప్పారు.