దానిమ్మతో మృదువైన చర్మం..

08-07-2019: దానిమ్మ ఆరోగ్యాన్నివ్వడమే కాదు చర్మానికి, జుట్టుకు అదనపు సౌందర్యాన్ని చేకూరుస్తుంది. ఎలాగంటే...

ఈ పండులో విటమిన్‌-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల చర్మానికి మృదుత్వం వస్తుంది.

దానిమ్మ గింజలు తింటే యాక్నే, నల్లమచ్చలు తగ్గుతాయి.
దానిమ్మ తొక్కును మెత్తటి పొడిలా చేసి అందులో టేబుల్‌ స్పూను నిమ్మరసం, టేబుల్‌స్పూను తేనె వేసి పేస్టులా చేసి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ వల్ల నల్లమచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. యాంటి-ఏజింగ్‌గా ఈ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది.
రెండు టేబుల్‌స్పూన్ల దానిమ్మ గింజలు తీసుకుని అందులో ఒక టేబుల్‌స్పూను పసుపువేసి, బాగా కలిపి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని యాక్నే ఉన్న ప్రదేశంలో రాసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీళ్లతో కడగాలి. ఈ ప్యాక్‌ యాక్నేతో చిట్లిన చర్మంపై మంచి ప్రభావం చూపుతుంది.
దానిమ్మ గింజలతో తయారుచేసిన నూనె వల్ల ఎగ్జిమా, సొరియాసిస్‌ తగ్గుతాయి.
ఈ పండులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను పటిష్టం చేస్తాయి.
చిక్కు స్వభావమున్న, రేగిపోయే జుట్టుకు దానిమ్మ నూనె అప్లై చేస్తే ఫలితం ఉంటుంది.