వైరల్‌ వ్యాధులపై పరిశోధనకు తొలి ‘హోమియో’ ల్యాబ్‌

కోల్‌కతా, సెప్టెంబరు 12: స్వైన్‌ ఫ్లూ, డెంగీ, చికున్‌ గన్యా, ఇన్‌ఫ్లూయెంజా వంటి వైరల్‌ వ్యాధులపై పరిశోధన నిమిత్తం దేశంలోనే తొలి హోమియోపతి పరిశోధన శాల కోల్‌కతాలో ఏర్పాటైంది. నగరంలోని డాక్టర్‌ అంజలి చటర్జీ రీజనల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హోమియోపతిలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌ను ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి శీప్రాద యశోనాయక్‌ ప్రారంభించారు. రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌లో ఆయా వ్యాధులపై పరిశోధన చేసి వాటిని నయం చేసే ఔషధాలను కనుగొంటామని ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్‌ వైద్యుడు ఒకరు తెలిపారు.