కోటి దాటిన కంటి పరీక్షలు

06-12-2018: రాష్ట్రంలో కంటి వెలుగు పరీక్షలు బుధవారం నాటికి కోటి దాటాయి. ఇప్పటి దాకా 1,00,02,544 మందికి పరీక్షలు నిర్వహించారు. అలాగే 16.94 లక్షల రీడింగ్‌ గ్లాసెస్‌ పంపిణీ చేశారు. మరో 19.61 లక్షల మందికి సూచించిన కళ్లద్దాలను అందించారు. 4.47 లక్షల మందికి కేటరాక్ట్‌ శస్త్రచికిత్సలు అవసరమవుతాయని నిర్ధారించారు. కాగా, రాష్ట్రంలో 62.39 లక్షల మందికి ఎలాంటి నేత్ర సంబంధిత సమస్యలు లేవని వెల్లడైంది.