ఆలోచనలను పెంచే వ్యాయామం!

06-03-2019: వ్యాయామం ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే! క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన ఆలోచనా శక్తి పెరుగుతుందన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. రన్నింగ్‌, జాగింగ్‌, వాకింగ్‌ చేయడం వలన యువతలో ఆలోచనా శక్తి మరింత మెరుగుపడుతుందని అధ్యయనకారులంటున్నారు. 22 నుంచి 60సంవత్సరాల లోపున్న సుమారు 140 మీద అధ్యయనం నిర్వహించారు. వీరికి మతిమరుపు లేదా ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేవు. అధ్యయనం మొదలయ్యే సమయానికి వీరికి క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటు కూడా లేదు. ఆరు నెలల పాటు వీరి చేత వారానికి నాలుగు రోజుల పాటు ఏరోబిక్‌ వ్యాయామాలు చేయించారు. గడువు ముగిసే సరికి వీరి మెదడు పనితీరును పరిశీలించారు. గతంలో కన్నా వీరి మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా ఆలోచనా పరిధిపెరగడాన్ని గమనించారు.