తండ్రుల ద్వారా లోపాలు!

06-03-2019: పిల్లల ఆరోగ్యంలోని లోటుపాట్లను తల్లికి ఆపాదిస్తుంటారు. కానీ ఇది తప్పంటున్నాయి  తాజా అధ్యయనాలు. పుట్టబోయే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయనే విషయం, వారి తల్లుల మీదే కాదు... తండ్రుల తీరు మీద కూడా ఆధారపడి ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలోని జార్జ్‌టౌన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. తండ్రికుండే అలవాట్లు, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం, ఇవన్నీ కూడా వాళ్ల వీర్యకణాలను ప్రభావితం చేస్తాయట. తద్వారా పుట్టబోయే పిల్లల జన్యువుల మీద ప్రభావం చూపుతాయంటున్నారు అధ్యయనకారులు. తండ్రికి మితాహారాన్ని తీసుకునే అలవాటే కనుక ఉంటే, అతని పిల్లల్లో గుండెజబ్బుల సమస్య తక్కువగా ఉంటుంది. అలా కాకుండా వాళ్లు కనుక ఊబకాయులై ఉంటే కనుక, అది వారి పిల్లల్లోని కొవ్వుకణాలను కూడా ప్రభావితం చేస్తుంది. తండ్రుల వయసు కూడా పుట్టబోయే పిల్లల మీద ప్రభావం చూపుతుందట. మరీ లేటు వయసులో జన్మనిచ్చే తండ్రుల వల్ల, పిల్లల మెదడుకి తిప్పలు తప్పవంటున్నారు