డాక్టర్ల హెచ్చరిక..మల విసర్జన తరువాత అలా చేయకపోతే...

చిన్నారుల్లో తీవ్ర ప్రభావం చూపుతున్న రక్తహీనత, పోషకాహార లోపం
వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతోనే నియంత్రణ
ఉభయ జిల్లాల వ్యాప్తంగా అల్బెండాజోల్‌ మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు
నేడు జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం

నిజామాబాద్, ఎల్లారెడ్డి టౌన్‌, 10-08-2018: పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించకపోవడం భోజనం చేసేముందు, చేసిన తరువాత చే తులు శుభ్రంగా ఉంచుకోక పోవడంతో చి న్నారులు కడుపునొప్ప, విరేచనాలతో బాధ పడుతుంటారు. చిన్నారుల పొట్టలో పోష కాలను హరిస్తూ ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలు చేసి ఇబ్బందులకు గురిచేసేవే నులి పురుగులు. ఈ నులిపురుగులు ప ట్ల జాగ్రత్తలు తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నా రు. వీటిపట్ల ఏ మాత్రం అలస త్వం ప్రదర్శిం చి నా చిన్నా రుల ఆరో గ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుం దని వైద్యు లంటున్నారు. ఆగస్టు 10వ తే దీని జాతీయ ను లి పురుగుల నివార ణ దినంగా ప్రకటించా రు. చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్ర భావం చూపుతున్న నులిపురుగుల ని వారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండుసార్లు 0-19 ఏళ్ల వారికి నులిపురుగుల ని వారణ మందులను అందించే కార్యక్ర మాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఫిబ్ర వరి 10న మొదటి విడతలో వేయగా, 2వ విడతలో భా గంగా ఆగస్టు 10 వ తేదీల్లో దేశ వ్యాప్తంగా నులి పురుగుల ని వారణ మం దులు వేయా లని ప్రభుత్వం ఆదే శాలు జారీ చేసింది. 2వ విడ తలో భాగంగా ఉభయ జిల్లా ల వ్యాప్తంగా ఉన్న పాఠశాల లు, అంగన్‌వాడీ కేంద్రాలలో పంపిణీ చేసేందుకు ఇప్పటికే వై ద్యశాఖ తరుపున అన్ని ఏ ర్పాట్లు చేశారు.

నులి పురుగుల వ్యాప్తి ఇలా...
పిల్లల్లో సాదారణం గా ఏలిక పాములు, నులిపురుగులు, కొంకి పురుగులు అనే మూడు రకాల క్రిములు కనబడతాయి, నులిపురుగులు మానవులలో పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభి వృద్ధి చెందే పరాన్న జీవులు, ఇవి అపరి శుభ్ర పరిసరాలతో చిన్నారుల చెంతకు చే రతాయి. నులిపురుగులు కలిగిన చిన్నారు లు, నులి పురుగులు కలిగిన గుడ్లు కలిగిన మలంతో నేలను కలుషితం చేస్తాడు. ఈ గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ది చెందుతాయి. మిగతా పిల్లలు ఆరుబ యట మట్టిని ముట్టడం, లేదా ఈ నులిపు రుగుల గుడ్లు చేరిన ఆహారాన్ని తీసు కోవడం వల్ల ఇత ర పిల్లల కడు పులోకి వెళ్లి అక్క డ వృద్ధి చెందడం మొదలు పెట్టి అక్కడే తిష్టవే స్తాయి. 19ఏళ్లలోపు వారి ఆరోగ్యంపై ఈ నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి.
 
సమస్యలు ఇలా..
నులిపురుగులు కలిగిన చిన్నారులు తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులు పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలి చిపోయి వివిధ రోగాల బారీన పడుతారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాలు కో ల్పోయే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా రక్త హీనత, పోషకాహార లోపం బారిన ప డతారు. ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతి సారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ను లిపురుగులు ఉన్న బాలబాలికలు ఆరుబ యట మలవిసర్జన చేస్తే అవి ఇతరుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
 
మాత్రలు వాడాల్సిందే..
ఈ నెల 10వ తేదీ గురువారం అల్బెం డాజోల్‌ మాత్రలు ఉచితంగా అందించేం దుకు ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అ న్ని ఏర్పాట్లు చేశారు. 1సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కలిగిన పిల్లలకు అరమా త్ర, రెండు సంవత్సరాల పిల్లలకు, 19ఏళ్ల లోపు యువతకు ఒకమాత్రను తప్పనిసరి గా మింగాలి. ఈ మాత్రను నేరుగా మిం గకుండా చప్పరిస్తే సరిపోతుందని వైద్యు లు సూచిస్తున్నారు.
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
మల విసర్జన తరువాత, భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కో వాలి.
స్వచ్ఛమైన నీటీనే త్రాగాలీ.
 ఆహారంపై ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి.
ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
చేతి గోర్లను చిన్నగా కత్తిరించుకోవాలి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయడం మానేయ్యాలి.
నేడు ఉభయ జిల్లాల వ్యాప్తంగా మాత్రల పంపిణీ.. శుక్రవారం ఉభయ జిల్లాల వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభు త్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలోని 0-19 ఏళ్లలోపు వారికి ఈ మందులను అం దుబాటులో ఉంచి, వాటిని పంపిణీ చేసే లా ఇప్పటికే వైద్యశాఖ అధికారులు అ న్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందు కోసం సిబ్బందికి అవగాహ న కార్యక్రమాలనూ నిర్వహించారు.

మూడు రకాల నులిపురుగులు..

పిల్లల్లో కనిపించే నులి పురుగులు సాధారణంగా మూడు రకాలు. 1)ఏలిక పాములు 2)నులి పురుగు లు 3)కొంకి పురుగులు. పిల్లలు నులి పు రుగుల ప్రభావానికి లోనైతే పోషకాహారలోపం తలెత్తుతుంది. ఆకలి మందగిస్తుంది. రక్తహీనత, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, విరేచనాలు, బరువు తగ్గడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
పిల్లలకు నట్టల నివారణ మాత్రలు తప్పనిసరి: నిజామాబాద్‌ కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు
ఒక సంవ త్సరం నుంచి 19 సంవత్సరాల వ యసున్న పిల్లలందరికీ నులి పురుగుల నట్టల నివారణ అల్బెండాజోల్‌ మాత్రలు తప్ప నిసరిగా వేయించాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ ఎం ఆర్‌ఎం రావు అన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జి ల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన నిర్మూలన ర్యాలీని కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు గురువారం జెండా ఊపి ప్రారంభించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాల్లో ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లలు 4,88,858 మందిని గుర్తించడం జరిగిందని, వారి కి 1756 ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్స్‌, జూనియర్‌ కళాశాలల్లో 1503 అంగన్‌వాడీ కేంద్రాల లో నులిపురుగుల నివారణ మాత్రలు పిల్లలకు అందజేస్తామన్నారు. పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్ల బహిరంగ మలవిసర్జన వల్ల నులిపరుగులు ఏర్పడుతాయ ని వాటివల్ల పిల్లల్లో ఆకలి మందగించడం, రక్తహీనత, పోషకాహా రం లోపాలు ఏర్పడుతాయన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూల న రోజున నులిపురుగుల నిర్మూలన మాత్రలు జూనియర్‌ క ళాశాల, పాఠశాల అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ఉచితంగా ఇవ్వబడుతాయని ఆయన తెలిపారు.