వ్యాయామంతో కొవ్వుకు చెక్‌!

04-02-2019: శరీరంలో కొవ్వు పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండెజబ్బులకు, షుగర్‌ వ్యాధికి దారితీస్తుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య హేతువైన విసెరల్‌ కొవ్వు మనకు తెలియకుండానే కరిగిపోతుందని, ఫలితంగా ఆరోగ్యంగా ఉండొచ్చని తాజా సర్వే వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సౌత్‌వెస్ట్రన్‌ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనాన్ని మాయో క్లినిక్‌ ప్రొసీడింగ్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. చాలా మంది పైకి కనిపించే కొవ్వును చూసి ఆందోళన చెందుతుంటారు. కానీ, అంతర్గతంగా విసెరల్‌ కొవ్వు చాలా ప్రమాదకరం. ఇదే కీలక అవయవాలను దెబ్బతీస్తుంది.