సోయాతో జాగ్రత్త

ఆంధ్రజ్యోతి,11-1-2017:సోయాతో చేసిన ఉత్పత్తులు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్న దాంట్లో నిజం లేదు అంటున్నారు పరిశోధకులు. సోయా ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే పురుషులలో ఫెర్టిలిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న విషయం ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. సుమారు 28 మంది యువకుల ఆహార అలవాట్లపై వీరు పరిశోధనలు నిర్వహించారు. వీరందరికీ కొన్ని రోజుల పాటు సోయా ఉత్పత్తులను క్రమం తప్పకుండా ఇచ్చారు. సోయాలోని ఫైటో ఈస్ర్టోజన్‌ అనే కెమికల్‌ కారణంగా ఈ యువకులలోని వీర్యకణాల క్రియాశీలత బాగా తగ్గడాన్ని వీరు గమనించారు. అంతేకాకుండా క్రోమోజోములు కూడా అంతులేకుండా పెరగడం వీరి దృష్టికి వచ్చింది. ఈ రెండు కారణాల వలన ఈ యువకులలో ఫెర్టిలిటీ సమస్య ఉత్పన్నమయింది. ఇదంతా సోయా ఉత్పత్తులు తీసుకోవడం వలనే అని వారు అంటున్నారు. పురుషులు కానీ, సీ్త్రలు కానీ సోయా ఉత్పత్తులు తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి అని వారు స్పష్టం చేస్తున్నారు. సోయా ఆరోగ్యానికి మంచిదే అయినా సంతానోత్పత్తిని కచ్చితంగా దెబ్బతీస్తుందని వారు చెబుతున్నారు.