90 ఏళ్ల వృద్ధురాలికి కృత్రిమ పేస్‌మేకర్‌.. ఆంధ్రా హాస్పటల్‌ ఘనత

విజయవాడ, 11-07-2018: తెనాలికి చెందిన 90 సంవత్సరాల కమలమ్మ అనే వృద్ధురాలిని అపస్మారకస్ధితిలో, ఆంధ్రా హాస్పటల్‌లో వైద్యం కోసం చేర్పించగా, ఆమెకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌ పేస్‌మేకర్‌కు చేరటం లేదని గుర్తించారు. ఆమెకు కృత్రిమ పేస్‌మేకర్‌ను అమర్చాలని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపి, వారి సమ్మతితో విజయవంతంగా కృత్రిమ పేస్‌మేకర్‌ను అమర్చినట్టు డాక్టర్‌ శ్రీమన్నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమలమ్మ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని త్వరగా కోలుకుంటుందని తెలిపారు.