లేటు వయసు వివాహాలతో.. తగ్గనున్న సంతాన సాఫల్యత

గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మందిలో సమస్య 

ప్రతి ఆరు జంటల్లో ఒకరికి సంతానలేమి బాధ 
అనూ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ నిర్వాహకుల వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఆలస్యంగా వివాహాలు చేసుకోవడంవల్ల దంపతు ల్లో సంతాన సాఫల్యంతగ్గే అవకాశం ఉంటుందని అనూ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ నిర్వాహకురాలు డాక్టర్‌ అనురాధ అన్నారు. ఒకప్పుడు 40 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు యుక్త వయసువారిలో కూడా కనిపిస్తోందన్నారు. లేటు వయసు వివాహాలతోపాటు మారిన జీవనశైలి, కాలుష్యం, భార్యాభర్తలు కలిసి ఉండే సమయం తగ్గడం, ఆహారపు అలవాట్లు, ల్యాప్‌టా్‌పల వంటి ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల రేడియేషన్‌ ప్రభావానికి గురికావడం వంటివి కూడా కారణాలన్నారు. తెలుగు రాషా్ట్రల్లో అత్యంత విజయవంతమైన టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌లలో ఒకటిగా, 2 దశాబ్దాల నుంచి ఆరువేలకు పైగా దంపతుల కలలను సాకారం చేసింది అనూ సంస్థ. కాగా తమ సెంటర్‌ సహకారంతో మాతృత్వపు అనుభూతులను సొంతం చేసుకున్న తల్లిదండ్రులు, వారి సంతానంతో సంస్థ నిర్వాహకులు ఆదివారం నెక్లె్‌సరోడ్‌లోని జలవిహార్‌లో ‘గెట్‌ టుగెదర్‌’ కార్యక్రమం నిర్వహించారు ఈ సంస్థ సహకారంతో 2 దశాబ్దాల క్రితం తల్లిదండ్రులుగా మారినవారి నుంచి 5 నెలల క్రితం మాతృత్వం పొందినవారి దాకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అనురాధ విలేకరులతో మాట్లాడుతూ.. 1994లో తమ క్లినిక్‌ను ప్రారంభించి.. 1995లో మొదటి టెస్ట్‌ట్యూబ్‌ బేబీని డెలివర్‌ చేసినట్లు తెలిపారు. తమ సహచర డాక్టర్‌ ప్రసాద్‌తోపాటు సిబ్బంది సహకారం, కృషి వల్ల 6 వేలకు పైగా దంపతుల కలలను సాకారం చేసినట్లు పేర్కొన్నారు. అత్యాధునిక పద్ధతులు అందుబాటులో వచ్చినా.. ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్స్‌కూ విజయశాతం పరిమితంగానే ఉందన్నారు. అయితే ఒక ఎటెంప్ట్‌ ఫెయిల్‌ కాగానే నిరుత్సాహానికి గురవడం కూడా సరికాదని అన్నారు. సంతానం కోరుకునే జంటలు మానసికంగా బలంగా ఉండటంతోపాటు.. ఐవీఎఫ్‌ తదితర చికిత్సలలో సాధ్యాసాధ్యాలనూ తెలుసుకోవడం మంచిదన్నారు. నేటితరం యువతలోనూ సంతానలేమి కనిపిస్తోందని, ప్రతి 6 జంటలలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. సంతానలేమి సమస్య బారిన పడకుండా ఉండేందుకు చక్కటి ఆరోగ్య శైలిని అనుసరించాలన్నారు. డాక్టర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. అందరికీ ఐవీఎఫ్‌ అవసరం ఉండదన్నారు. పేషంట్‌ను పరీక్షించాక సరైన చికిత్స అందిస్తామని తెలిపారు. వాటివల్ల కూడా గర్భంరాని సందర్భాల్లో మాత్రమే ఐవీఎ్‌ఫకు వెళ్తుంటామన్నారు. తమ సెంటర్‌ తొలినాళ్లలో పుట్టిన ఓ ఐవీఎఫ్‌ బేబీ.. ఇప్పుడు సహజసిద్ధంగా మరోచిన్నారికి జన్మనివ్వడం ఆనందంగా ఉందన్నారు. 
 
ఒక్కరైనా అనుకుంటే ఇద్దరు.. 
పిల్లల కోసం పదేళ్లపాటు తిరగని హాస్పిటల్‌ లేదు. అన్ని చోట్లా ఫెయిల్‌. చివరికి అనూకు వచ్చాం. ఒక్కరైనా చాలనుకున్నాం. ఏడాదిలోనే కవల పిల్లలకు జన్మనిచ్చింది మా శ్రీమతి. 
- రామనాథం, సుధారాణి, నంది వనపర్తి