పగటి పూట నిద్రమత్తుతో అల్జీమర్స్‌

08-09-2018: పగటి పూట నిద్రమత్తుతో ఉండేవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. వీరిలో అల్జీమర్స్‌ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని జాన్స్‌ హోప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. మెదడులో ఉండే బీటా అమిలాయిడ్‌ అనే ప్రొటీన్‌ ఫలకికలు గట్టిగా తయారై ఈ సమస్య ఎదురవుతుందని, దాని ఫలితమే నిద్రమత్తు అని పరిశోధకులు వెల్లడించారు.