జంక్‌ఫుడ్‌ తింటే అలర్జీ!

09-06-2019: రుచిగా ఉంది కదా అని జంక్‌ఫుడ్‌ను అతిగా తింటే అలర్జీలు చుట్టుముట్టడం ఖాయమని తాజా అధ్యయన నివేదికలు కుండబద్దలు కొడుతున్నాయి. ఇటలీలోని నేపుల్స్‌ ఫెడెరికో-2 విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం 6 నుంచి 12 ఏళ్ల లోపు 61 మంది బాలలను మూడు గ్రూపులుగా విభజించి వారి ఆరోగ్య స్థితిగతులపై ప్రత్యేక పరిశీలన జరిపింది. చక్కెర,కొవ్వు మోతాదు ఎక్కువగా ఉన్న తినుబండారాలు, ప్రాసెస్‌ చేసిన, మైక్రోవేవ్డ్‌ ఆహార పదార్థాలు, కాల్చిన మాంసం వంటివి తినేవారు ఆహార, శ్వాససంబంధ అలర్జీలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.