మద్యం మితంగా తాగినా ముప్పే!

09-03-2019: మద్యం మితంగా తాగితే పెద్దగా ఇబ్బందేమీ ఉండదనుకునేవారికి హెచ్చరిక. మద్యం మితంగా తీసుకున్నా ఆరోగ్యానికి ఇబ్బందేనని తాజా అధ్యయనం వెల్లడించింది. మితంగా మద్యం తాగేవారిలో రక్తపోటు(బీపీ) పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తక్కువ మోతాదులోనే అయినా వారంలో ఏడు నుంచి 13 సార్లు మద్యం తాగితే రక్తపోటు పెరుగుతుందని అధ్యయనం వెల్లడించింది. అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య, పౌష్ఠికాహార కేంద్రానికి చెందిన అధ్యయనకర్తలు 17,059 మంది ఆరోగ్యాన్ని పరిశీలించారు.