మైకాన్ని తగ్గించే పరికరం!

11-09-2018: కళ్లు బయర్లు కమ్మడం, తల తిప్పడం లాంటి సమస్యలకు చికిత్స చేసే సరికొత్త పరికరాన్ని స్వీడన్‌లోని చాల్మర్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మైకాన్ని తగ్గించేందుకు వెంప్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. అయితే, దానివల్ల వినికిడిలోపం, అసౌకర్యం కలుగుతాయి. తాజాగా రూపొందించిన పరికరంతో ఆ సమస్యలు ఉండవు. దాన్ని చెవి వెనుక భాగంలో ఉంచితే దాన్నుంచి వెలువడే కంపనాలు మైకాన్ని తగ్గిస్తాయని పరిశోధకులు వివరించారు.