జనవరి 1న.. 69,444 జననాలు

02-01-2019: పుట్టినరోజు అందరికీపండగే! జనవరి 1న పుట్టడమంటే మరింత స్పెషల్‌!! అలాంటి ప్రత్యేకమైన రోజున ఈసారి మనదేశంలో 69,444 మంది శిశువులు జన్మిస్తారని యునిసెఫ్‌ వెల్లడించింది. మన తర్వాత చైనాలో ఈ ఏడాది జనవరి 1న 44,940 మంది శిశువులు జన్మిస్తారని పేర్కొంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 3,95,072 మంది శిశువులు ఆంగ్ల సంవత్సరాదిన పుడ్తారని యునిసెఫ్‌ అంచనా. మనదేశంలో మంగళవారంనాడు నిజంగానే 69,444 మంది పుట్టారా.. గణాంకాలు వెల్లడయ్యాకే అసలు విషయం తెలుస్తుంది.