సరోగసీతో ఒకే రోజు 15 మంది శిశువుల జననం

 సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 15 (కరీంనగర్‌): సరోగసీ పద్ధతి ద్వారా బుధవారం ఒక్క రోజే 15 మంది పిల్లలు జన్మించారు. ఈ అరుదైన సంఘటనను డాక్టర్‌ పద్మజ సంతాన సాఫల్య కేంద్రంలో ఆవిష్కృత మైంది. వివిధ కారణాలతో గర్భం దాల్చలేని మహిళలు, సరోగసీ ద్వారా తమ కలను సాకారం చేసుకుంటున్నారని డాక్టర్‌ పద్మజ తెలిపారు. ఇందులో కరీంనగర్‌ జిల్లాతో పాటు ఇతర రాష్ర్టాల వారు, అమెరికా, దుబాయ్‌ నుంచి వచ్చిన జంటలున్నాయన్నారు.