గాంధీ ఆసుపత్రిలో 14 మందికి స్వైన్ ఫ్లూ

12-09-2017: అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన 14 మంది డిజాస్టర్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిలో 10 మంది రక్త నమూనాలు సేకరించగా స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నట్టు తేలింది. ప్రస్తుతం వీరికి ప్రత్యేక వైద్యసేవలందిస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌ చెప్పారు.