సాయికృష్ణ వైద్యానికి 10 లక్షల సాయం

అతడి తల్లిదండ్రులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందించిన కేటీఆర్‌

మహబూబాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో దుండగుల కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహబూబాబాద్‌ వాసి సాయికృష్ణ వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరు చేసిన రూ.10 లక్షల చెక్కును సాయికృష్ణ తల్లిదండ్రులు పూస ఎల్లయ్య, శైలజకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం అందజేశారు. వారు అమెరికా వెళ్లడానికి వీసాలు మంజూరు చేయించారు. సాయికృష్ణ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడి వైద్యం కోసం 10లక్షల సాయం అందించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.