పరులకు సాయంతో దీర్ఘాయువు

బెర్లిన్‌, డిసెంబరు 24: ఇతరులకు సాయం చేసేవారు ఎక్కువ కాలం బతుకుతారని తాజా ఆధ్యయనంలో వెల్లడైంది. వృద్ధులు తమ మనవళ్లు, మనమరాళ్లతో గడుపుతూ... వారి బాగోగులు చూసుకుంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పిల్లలు లేని వారు తమ ఇరుగుపొరుగు వారికి చిన్నచిన్న పనుల్లో సాయం చేయడం, వారితో సత్సంబంధాలు కలిగి ఉండడం ద్వారా పై ఫలితాలే పొందవచ్చన్నారు. జర్మనీలోని మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవల్‌పమెంట్‌ పరిశోధకులు 1990 నుంచి 2009 వరకు 70-103 మధ్య వయస్కులపై అధ్యయనం చేశారు. వీరిలో తమ మనవళ్ల బాగోగులు చూసినవారి జీవిత కాలం చూడని వారి కన్నా దాదాపు పదేళ్లు పెరిగినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.