యాంటీబయాటిక్స్‌తో ఆ శక్తి నిర్వీర్యం!

06-07-2019: ఫ్లూను తట్టుకునే ఊపిరితిత్తుల వ్యవస్థను యాంటీబయాటిక్స్‌ నిర్వీర్యం చేస్తాయని తాజా సర్వే పేర్కొంది. రుగ్మత పెరగడానికి కూడా కారణమవుతాయని వెల్లడించింది. ఫ్రాన్సిస్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు నిర్వహించిన ఈ సర్వే వివరాలను సెల్‌ రిపోర్ట్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఫ్లూను నిరోధించడంలో సాయపడే గట్‌ బ్యాక్టీరియాను యాంటీబయాటిక్స్‌ నిర్మూలిస్తాయని వెల్లడించారు.