లోపలినుంచే కేన్సర్‌ను చంపే ‘ట్రోజాన్‌ హార్స్‌’!

09-02-2019: ట్రోజాన్‌ హార్స్‌లా కేన్సర్‌పై పట్టువదలకుండా పనిచేసే సరికొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ మందు కేన్సర్‌ కణాల్లోకి ప్రవేశించి వాటిని నాశనం చేస్తుందని, 6 రకాల కేన్సర్‌ చికిత్సలో మంచి ఫలితాలను అందిస్తుందని బ్రిటన్‌లోని కేన్సర్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గర్భాశయ, పిత్తాశయ, ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న వారిపై టిసోటుమాబ్‌ వెడోటిన్‌ అనే ఈ మందును ప్రయోగించగా మెరుగైన ఫలితాలను అందించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది రెండో దశ ట్రయల్స్‌లో ఉందని, మరిన్ని ప్రయోగాలు చేయాలని పరిశోధకులు చెప్పారు.