ఆరోగ్యమే 2016 భాగ్యం

ఆంధ్రజ్యోతి, 27-12-2016: హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌ అని తెలిసొచ్చింది. అందుకే ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ ఏడాది ఎక్కువమంది హెల్త్‌ విషయంలో పాటించిన అంశాలివి... 
 
ప్రకృతికి దగ్గరగా...
ఇంట్లో, జిమ్‌లో వర్కవుట్‌లు చేయడాన్ని చాలా మంది తగ్గించారు. ప్రకృతితో మమేకమై వ్యాయామం చేయడంపై మక్కువ చూపించారు. అవుట్‌డోర్‌ మెడిటేషన్‌, పర్వతాలు ఎక్కడం, స్విమ్మింగ్‌ చేయడం వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌కు దూరంగా ప్రకృతికి దగ్గరగా గడపటానికి ఇష్టపడ్డారు. 
 
ఒత్తిడిని అధిగమించేందుకు...
సూపర్‌హెర్బ్స్‌ వాడకంపై ఎక్కువ ఆసక్తి కనబరిచారు. రోజువారి సె్ట్రస్‌ నుంచి కాపాడుకోవాలంటే హెర్బ్స్‌ ఒక్కటే మార్గమని భావించారు. సలాడ్స్‌, స్మూతీస్‌, సూప్స్‌లో అడాప్టొజెన్స్‌ను కలిపి తీసుకోవడంపై దృష్టిపెట్టారు. అడాప్టొజెన్స్‌ అంటే ఎడ్రినల్‌ రెస్పాన్స్‌ని బ్యాలెన్స్‌ చేయడానికి ఉపయోగపడే ఒక హెర్బల్‌ పదార్థం. 
 
పంచదారకు చెక్‌
 
ఈ ఏడాది చాలా మంది పంచదారను బాగా తగ్గించారు. పంచదారను తగ్గించడం 
మంచిదని పలు అధ్యయనాలు వెలువరించడంతో నేచురల్‌ 
స్వీట్‌నర్స్‌ వైపు మళ్లారు. 
 
యాంటీ డైట్‌
సహజసిద్ధమైన ఆహార విధానాలను అనుసరించడానికి చాలా మంది ప్రయత్నించారు. ఆకలి అయినపుడు మాత్రమే తినాలని నియమం పెట్టుకున్నారు. అవసరం లేకుండా తినడం వంటి అలవాటు మానుకోవడానికి ప్రయత్నించారు. 
 
ఓల్డ్‌ మాంక్‌ టీ
టీ, కాఫీలకు బదులుగా గ్రీన్‌ టీ తాగడానికి ఆసక్తి కనబరిచారు. కొంతమంది మట్చా టీ తాగడానికి ఆసక్తి చూపారు. బౌద్ధ భిక్షువులు, సమురాయి వారియర్స్‌ మట్చా డ్రింక్‌ను తాగుతారు. స్పష్టమైన ఆలోచనలను ఇంప్రూవ్‌ చేసుకోవడానికి ఈ టీ బాగా ఉపకరిస్తుంది. 
 
స్టెప్స్‌ కౌంట్‌
ఫిట్‌నెస్‌ ట్రాకర్స్‌ వచ్చాక ప్రతి ఒక్కరూ వాటిని వాడటం మొదలు పెట్టారు. ఈ ఏడాది ఫిట్‌నెస్‌ ట్రాకర్స్‌దే అని 
చెప్పవచ్చు. రోజూ ఎంత దూరం నడిచాం. ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి వంటి అంశాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. 
 
ఫిట్‌నెస్‌ గాడ్స్‌
ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్‌ ఫిట్‌నెస్‌ ఇనిస్పిరేషన్‌గా ఉపయోగపడింది. సెలబ్రిటీ ట్రైనర్స్‌, ఫిట్‌నెస్‌ శిక్షకులు ఇన్‌సా్ట్రగ్రామ్‌ అకౌంట్స్‌లో విలువైన ఫిట్‌నెస్‌ సూచనలు అందచేయడం పెరిగింది. 
 
ఆఫీస్‌లో ఆరోగ్యం
వర్క్‌ప్లే్‌సలో వెల్‌నెస్‌ అనే కాన్సెప్ట్‌ బాగా పెరిగింది. ఆఫీస్‌లో యోగా క్లాసులకు అటెండ్‌ కావడం, ఆఫీస్‌ జిమ్‌లో వర్కవుట్‌లు చేయడం వంటివి పెరిగాయి. ఆరోగ్యం ప్రాధాన్యత లిస్ట్‌లో మొదటి స్థానంలోకి చేరింది ఆఫీస్‌లు కూడా వెల్‌నెస్‌ గోల్స్‌కు తగినట్టుగా డిజైన్‌ చేయడం పెరిగింది. 
 
రన్నింగ్‌
ఫిట్‌నెస్‌ అంశాలను తీసుకుంటే అందులో రన్నింగ్‌ను ఎక్కువ మంది ఎంచుకున్నారు. పార్కుల్లో పరుగెత్తడం, ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్‌ చేయడం వంటివి పెరిగాయి.