విచారం కంటే కోపమే ప్రమాదం!

11-05-2019: పెద్ద వయస్సు కలిగిన వారిలో విచారం, బాధ సహజం. దాని వలన మానసిక సమస్యలు తలెత్తుతాయి. కానీ.. వారు బాధ కంటే కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తే గుండె జబ్బులు, మోకాళ్ల నొప్పులు, కేన్సర్‌ వంటి ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని అమెరికాలోని కాన్‌కోర్డియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. అధ్యయనంలో భాగంగా 59 నుంచి 93 ఏళ్ల మధ్య వయసున్న 226 మంది మానసిక స్థితిని పరిశోధకులు విశ్లేషించారు. ఈ క్రమంలో వారిలోని బాధ కంటే కోపమే వారికి ఎక్కువ హాని చేస్తున్నట్టు గుర్తించారు. ఎక్కువగా కోప్పడేవా ప్రాణాంతక జబ్బుల బారిన పడే అవకాశాలున్నట్టు వారు తెలిపారు.