మధుమేహానికీ ఉందో మాత్ర!

13-06-2018: మధుమేహం సమస్యను ఎదుర్కొనేవారిలో చాలామంది ఊబకాయంతో బాధపడేవాళ్లే. వ్యాయామం, సర్జరీలు, డైటింగ్‌లు అంటూ ఏవేవో చేస్తుంటారు. ఆ బాధ లేకుండా.. మధుమేహాన్ని తగ్గించే మాత్రను అమెరికాకు చెందిన బ్రిఘం అండ్‌ వుమెన్స్‌ హాస్పిటల్‌ వైద్యులు తయారుచేశారు. ఆహారం తీసుకునేముందు ఈ మాత్రను వేసుకుంటే పేగుల చుట్టూ కవచంలా మారి ఆహారంలోని చక్కెర కాలేయానికి అంటకుండా కాపాడుతుందట. దాంతో మధుమేహం తగ్గి బాధితుడికి ఉపశమనం కలుగుతుందని పరిశోధకులు వివరించారు.