ఆ ‘సింబల్ సీక్రెట్’లో ఆరోగ్య హెచ్చరికలు

ఆంధ్రజ్యోతి, 13-02-2018: టూత్‌పేస్టు ట్యూబ్‌పై రంగులతో కూడిన ఒక స్క్వేర్ ఆకారం ఉంటుంది. ఈ కోడ్‌లలో ఆరోగ్య రహస్యం దాగుంటుందనే విషయం మీకు తెలుసా? టూత్‌పేస్టును పళ్లను శుభ్రంచేసుకునేందుకు వినియోగిస్తుంటారనే విషయం విదితమే! అయితే కొన్ని టూత్‌పేస్టుల వలన హాని జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ప్రభుత్వ నిబంధనలు అనుసరించి టూత్‌పేస్టు కంపెనీలు.. సంబంధిత పేస్టులో వినియోగించిన కెమికల్స్ వివరాలు ప్యాక్‌పై తప్పనిసరిగా వెల్లడించాలి. అయితే ఈ వివరాలను సదరు టూత్‌పేస్టు కంపెనీలు కోడ్ రూపంలో వెల్లడిస్తుంటాయి. ఎరుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ రంగులలో స్క్వేర్ గుర్తులను ముద్రిస్తుంటాయి. నలుపు రంగు, ఎరుపు రంగు గుర్తులుంటే ఆ పేస్టులలో అధికంగా కెమికల్స్ వినియోగించారని అర్థం. ఇటువంటి పేస్టును వినియోగించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. అయితే నీలి రంగు స్క్వేర్ ఉంటే అది సురక్షితమైన టూత్‌పేస్టు అని అర్థం. ఇటువంటి పేస్టులో ప్రకృతి సహజసిద్ధమైన లక్షణాలున్నాయని గ్రహించవచ్చు. ఇక ఆకుపచ్చరంగు సింబల్ ఉన్న టూత్‌పేస్టు ఆరోగ్యానికి అత్యుత్తమని అర్థం. ఏదిఏమైనా తగిన టూత్ పేస్టులను వినియోగించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.