రక్తంలో సోడియం తగ్గితే ఆలోచనలపై ప్రభావం

11-02-2018: రక్తంలో సోడియం మోతాదు తగ్గితే వయసు పెరిగే కొద్ది ఆలోచనా శక్తి తగ్గుతుందని పరిశోధనలో తేలింది. సాధారణంగా రక్తంలో సోడియం మోతాదు 135 మిల్లీ మోల్స్‌ కంటే తగ్గితే స్పృహ కోల్పోవడం, మగతగా ఉండడం జరుగుతుంది. తాజా పరిశోధనలో ఆలోచనా శక్తి తగ్గిపోతుందని, హృద్రోగాలు తలెత్తుతాయని తేలింది. అమెరికాలోని కొలరాడో వర్సిటీ పరిశోధకులు 65 ఏళ్లు దాటిన వారిని పరిశీలించి ఈవిషయాన్ని వెల్లడించారు.