‘పొగ’ పీల్చినా ప్రమాదమే!

09-03-2019: సరదా.. సరదా.. సిగరెట్టు! అంటూ పొగతాగే వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో.. ఈ పొగను పీల్చేవారికి కూడా ఇలాంటి సమస్యలే వస్తాయని చెబుతోంది తాజా అధ్యయనం. పొగ పీల్చేవారిలో కిడ్నీ సంబంధిత అనారోగ్యాలు వస్తున్నాయని పేర్కొంది. పొగ తాగే వారు వదలిపెట్టే పొగను పీల్చిన వారికి పలు రకాల వ్యాధులు వస్తున్నాయని అధ్యయనం తెలిపింది. 2001 నుంచి 2014 మధ్య చేసిన అధ్యయనంలో అసలు పొగ తాగని 1,31,196 మంది ఆరోగ్యాన్ని అధ్యయనకర్తలు పరిశీలించారు. వీరిలో చాలా మంది పొగతాగే వారితో ఏదో ఒకరూపంలో సంబంధాన్ని కలిగి ఉండి, వారు వదిలిన పొగను పీల్చారు. దీంతో వీరి కిడ్నీ వ్యవస్థ దెబ్బతిన్నట్టు గుర్తించారు.