స్వీట్లు తింటే నిద్ర!

10-04-2019: నిద్ర పట్టక సతమతమవుతుంటే.. కొద్దిగా తీపి తినండంటున్నారు  మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ  పరిశోధకులు. వీళ్ళు 51 మంది యువకులను పరీక్షించి ఈ విషయం తేల్చారు. కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల కావడమే నిద్రలేమికి కారణమని వారు చెబుతున్నారు.తాము ఎంపిక చేసినవారి తలలకు ఎలక్ట్రోడ్స్ అమర్చి.. రెండు రాత్రుళ్ళు వారి నిద్రా సమయాల్లో కలిగిన మార్పులను పరిశీలించారు. వీరిలో కొందరికి పగటిపూట మధ్యమధ్య 14 నుంచి 18 షుగర్ డ్రింకులను ఇస్తూ వారి నిద్రపోయే సమయాన్ని బేరీజు వేశారు. నిద్రపోయే ముందు చక్కెర ఆధారిత పదార్థాలు, డ్రింకులు తాగిన వారు రాత్రి సమయంలో ఏడెనిమిది గంటలపాటు గాఢ నిద్ర పోవడాన్ని గమనించారు. తీపి పదార్థాలు తీసుకోని వారు అంత గాఢ నిద్రపోలేదు. మొత్తానికి నిద్రకు, తీపికి సంబంధముందని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే షుగర్‌ వ్యాధిగ్రస్తులు తీపి తినడం మంచిదని వారు హెచ్చరిస్తున్నారు. గాఢనిద్రకు వారు సహజసిద్ధ పద్ధతులను ఆచరించాలని సూచించారు.