ఈ-సిగరెట్‌తో శ్వాసకోశ వ్యాధులు

09-06-2019: ధూమపానాన్ని మాన్పించేందుకు ఈ-సిగరెటే ప్రత్యామ్నాయం అనేది ఎంత నిజమో.. ఈ-సిగరెట్‌లోని నికోటిన్‌ను పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయనేది కూడా అంతే నిజమని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారి కథనం ప్రకారం.. ఈ-సిగరెట్‌ పీల్చినప్పుడు ఆవిరి రూపంలో బయటికి వెలువడే నికోటిన్‌ ప్రభావంతో ముక్కులోని శ్లేష్మం(చీముడు) గట్టిపడుతుంది. అంతేకాదు ముక్కులోని సూక్ష్మరోమాల కదలిక రేటు ఒక్కసారిగా తగ్గిపోతుంది. వెరసి, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది.