ప్రొస్టేట్‌ కేన్సర్‌ తీవ్రత గుర్తించే కొత్త పరికరం!

09-02-2019: ప్రొస్టేట్‌ కేన్సర్‌ తీవ్రతను కచ్చితంగా గుర్తించే సరికొత్త మెషీన్‌ లెర్నింగ్‌ పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వైద్యులు, రేడియాలజిస్టులు.. రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు దోహదపడేలా ఫ్రేమ్‌వర్క్‌ను తయారుచేశారు. ప్రస్తుతం మల్టిపారామెట్రిక్‌ మాగ్నటిక్‌ రిసోనెన్స్‌ ఇమేజింగ్‌ ద్వారా ప్రొస్టేట్‌ కేన్సర్‌ ప్రమాదాన్ని గుర్తిస్తున్నారు. అయితే తాము రూపొందించిన ఈ పరికరం ప్రొస్టేట్‌ కేన్సర్‌ పురోగతిని కచ్చితంగా అంచనా వేయగలదని పరిశోధకుల్లో ఒకరైన గౌరవ్‌ పాండే తెలిపారు.